అక్రిడిటేషన్ కార్డుల జారీకి డిమాండ్.

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన విజయవంతం

అక్రిడిటేషన్ కార్డుల జారీకి డిమాండ్.

రాజన్నసిరిసిల్ల :అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అత్యంత కీలకమైన అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, అలాగే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆలీ, ఉపాధ్యక్షులు సీహెచ్. దేవరాజ్, విష్ణు, ప్రవీణ్, నాగరాజు, నవీన్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం