కరీంనగర్‌లో వరుస దోపిడీలు... ప్రజల్లో భయం

కరీంనగర్‌లో వరుస దోపిడీలు... ప్రజల్లో భయం

కరీంనగర్ :కరీంనగర్ నగరంలో పీఎంజీ జ్యూయెలర్స్‌లో జరిగిన కాల్పుల ఘటన మరువకముందే అదే స్థాయిలో మరో భారీ దోపిడీ జరిగి ప్రజలను వణికిస్తోంది. భగత్ నగర్ లోని అజ్మత్ అలీ ఇంటికి బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 8 మంది దుండగులు ఆయుధాలతో వచ్చారు. కుటుంబ సభ్యులపై తుపాకులు గురిపెట్టి బెదిరించి, అందరినీ ఒక గదిలో గంటసేపు బంధించారు.అనంతరం ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి రూ.21 లక్షల నగదు, 70తులాల బంగారు ఆభరణాలు, వెండి సామానును సంచుల్లో సర్దుకున్నారు. పారిపోయే సమయంలో ఇంటి ఆవరణలో పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను కూడా ఎత్తుకెళ్లారు. దోపిడీ చేసిన అనంతరం దుండగులు తాళం బయటి నుంచి వేసి వెళ్లిపోయారు. ఉదయం వరకు బయటకు రాలేకపోయిన కుటుంబ సభ్యులు తెల్లవారుజామున అరుపులు విని వచ్చిన స్థానికులు తాళం తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని అన్నారు 
దగ్గరి బంధువు పైన అనుమానం
ఈ ఘటనలో తమకు తెలిసిన దగ్గరి బంధువు పాత్ర ఉండవచ్చని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఇంటి వివరాలు, నగదు, బంగారం ఉన్న విషయం బయటి వారికి తెలిసే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
నగరంలో పెరుగుతున్న నేరాలు
గత వారం పీఎంజీ జ్యూయెలర్స్‌లో జరిగిన కాల్పులు, నగదు దోపిడీ తర్వాత ఇప్పుడు భగత్ నగర్ లో ఇదే తరహా ఘటన జరగడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు పహారా పెంచాలని, దోపిడీ దొంగలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
 
 
Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం