జాతీయ ఆహార భద్రత చట్ట సవరణలు విరమించుకోవాలి

జాతీయ ఆహార భద్రత చట్ట సవరణలు విరమించుకోవాలి

జహీరాబాద్  : జాతీయ ఆహార భద్రత చట్టం–2013కు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, అలాగే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ (ఆర్‌పీడీ) చట్టం ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న అంత్యోదయ రేషన్ కార్డు ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం అందుతుండడం వల్ల వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తోందన్నారు. అయితే ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం మాత్రమే ఇవ్వాలనే ప్రతిపాదిత సవరణ వికలాంగులు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులకు, పేదలకు కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అంత్యోదయ రేషన్ కార్డులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్–66 ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, 2019లో ఏర్పాటైన మండలి కాలపరిమితి ముగిసి నాలుగేళ్లు గడిచినా కొత్త మండలిని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. దీనివల్ల వికలాంగుల హక్కుల చట్టం అమలుపై పర్యవేక్షణ లోపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త సలహా మండలిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నింటి నరసింహులు, హైమత్, ఎం. రాజ్‌కుమార్, అంజాద్ అలీ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం