ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
జహీరాబాద్ : జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామ సర్పంచ్ పొగాకు నరేష్ కుమార్‌కు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో జి.పి.డి.పి ప్రణాళిక కింద చేపట్టిన సీసీ రోడ్డు పనులకు సంబంధించిన రూ.7,73,604 బిల్లులు పనులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని విచారణలో తేలినట్లు డీపీఓ పేర్కొన్నారు. ఈ అంశంపై జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ జిల్లా కలెక్టర్, డీపీఓ, డీఎల్పీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పెండింగ్ బిల్లుల విషయం నిర్ధారణ కావడంతో సంబంధిత బిల్లుల చెల్లింపుల విషయంలో గ్రామ సర్పంచ్ తగిన చర్యలు తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సర్పంచ్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ ఏడు రోజులలోపు తన లిఖితపూర్వక సంజాయిషీని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి సమర్పించాలని షోకాజ్ నోటీసులో ఆదేశించారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
