కథనానికి స్పందన.. రైల్వే బ్రిడ్జి రోడ్డుకు మరమ్మతులు

కథనానికి స్పందన.. రైల్వే బ్రిడ్జి రోడ్డుకు మరమ్మతులు

మెట్‌పల్లి డివిజన్,  మెట్‌పల్లి పట్టణంలోని రైల్వే బ్రిడ్జి కింద రహదారి అధ్వానంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయంపై విజన్ ఆంధ్రలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రహదారిపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు. రైల్వే బ్రిడ్జి కింద రహదారి గుంతలమయంగా మారడంతో పాటు పలు చోట్ల ఇనుపచువ్వలు బయటకు తేలి ఉండటం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారిన పరిస్థితిని కథనంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టడంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యపై స్పందనకు అభినందనలు

WhatsApp Image 2026-09-17 at 10.16.32 AMప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రహదారి సమస్యను అధికారులు గుర్తించి తక్షణమే స్పందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత మరమ్మతులు తాత్కాలికంగా కాకుండా, భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని రహదారికి నాణ్యతా ప్రమాణాలతో శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికారులు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు విజన్ ఆంధ్రకు కృతజ్ఞతలు తెలిపారు. రహదారి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భవిష్యత్తులో మళ్లీ గుంతలు ఏర్పడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Views: 117

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News