పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యమే లక్ష్యంగా నిర్ణయాలు: మున్సిపల్ చైర్‌పర్సన్
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం సాధారణ సమావేశం మంగళవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్ కార్ పద్మబాయి నర్సింగరావు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. పురపాలక పరిధిలోని వివిధ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత వేగవంతం చేయాలని, వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాలకవర్గం, అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 94
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
