మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశం
మంగపేట : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశానుసారం గురువారం మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకులు భాస్కర్ హాజరై మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం అత్యంత కీలకమైందని మండలంలోని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తమకు కేటాయించిన పరిధిలో నిర్ణీత గడువులోపు సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రతి బీఎల్ఏ బిఎల్వోలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆక రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య మండల యూత్ అధ్యక్షులు బాడిషా ఆదినారాయణ పాయం అనిత మాసిరెడ్డి వెంకటరెడ్డి తుడి భగవాన్ రెడ్డి ఎర్రంగారి సురేష్ చిన్నపెల్లి రాంబాబు, బెవర సత్యనారాయణ జంగం భానుచందర్ బసారికారి హరికృష్ణ గూడూరు రంజిత్ పిండిగా నాగరాజు మీడియా ఇంచార్జి బసరికారి నాగార్జున బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
