ఇంటింటికి రెండు చెత్త బుట్టల పంపిణీ.
చౌటకూర్స్వ: చ్ఛ గ్రామం–ఆరోగ్య గ్రామం లక్ష్యంగా చౌటకూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబానికి రెండు చొప్పున చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ పార్కల రాంరెడ్డి ప్రారంభించి గ్రామస్తులకు బుట్టలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రతను కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి అందించాలని గ్రామస్తులకు సూచించారు.గ్రామ వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని, పరిశుభ్రత అనేది గ్రామపంచాయతీ ఒక్కదాని బాధ్యత కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన గ్రామాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కలాలి రామగౌడ్, గ్రామ అధ్యక్షుడు వర్కల రమేష్, నాయకులు మల్లికార్జున్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు హరీష్ బాల్జ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


