రాహుల్ అరెస్ట్‌ను ఖండించి కాంగ్రెస్ భారీ ధర్నా
కరీంనగర్ : న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారుగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి కరీంనగర్ డిసిసిఅధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారుప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం బీజేపీ నియంతృత్వానికి నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కుతోంది అని మేడిపల్లి సత్యం ఆరోపించారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామ ని స్పష్టం చేశారు.
ప్లకార్డులతో నినాదాలు
ఈ ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు నీటిపై పార్లమెంటులో చర్చ జరపాలి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోఅంటూ నినాదాలు చేశారు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Jul 2026 18:21:04
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
