గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్ముడికి నివాళులు

గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్ముడికి నివాళులు

 నివాళులు అర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్: సత్యం, శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని గాంధీ పార్క్‌‌లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్  గార్లతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రము కోసం గాంధీజీ అందించిన సేవలు, అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ , ప్రాజెక్ట్ డైరెక్టర్ సివిఎన్ రాజు,జిల్లా స్పోర్ట్స్ అధికారి దయానంద్ రెడ్డి,ఎం ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి