గంభీరావుపేటలోవిద్యుత్ షాక్ తో భార్యాభర్తల మృతి 

గంభీరావుపేటలోవిద్యుత్ షాక్ తో భార్యాభర్తల మృతి 

పంట పొలంలోనే భార్యాభర్తల కానరాని లోకాలకు

గంభీరావుపేట, : విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందిన  ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య(70),  గంట లక్ష్మి(60) మృతి చెందారు. గురువారం వ్యవసాయ పనులకు వెళ్లి భార్యాభర్తలు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వ్యవసాయ పొలంలోనే భార్యాభర్తల మృతితో స్థానికంగా  విషాద చాయలు చోటు చేసుకున్నాయి. పంట పొలానికి విద్యుత్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం అటువైపు వ్యవసాయ పనులకు వెళ్లినవారు చూసి  భార్యాభర్తలు మృతి చెందినట్లు తెలవడంతో తక్షణం పోలీసులు, బంధువులకు  సమాచారం అందించినట్లు, మృతులకు ఇద్దరు కుమార్తెలు కలిగి ఉన్నారు. భార్యాభర్తల మృతితో బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సిహెచ్. శ్రీకాంత్ సంఘటన స్థలానికి వెళ్లి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకై సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి  దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Views: 507

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి