27, 28 తేదీల్లో రెజ్లింగ్ స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశ ఎంపికలు

 27, 28 తేదీల్లో రెజ్లింగ్ స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశ ఎంపికలు

కొత్తగూడెం  : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉన్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో రెజ్లింగ్ విభాగంలో బాలుర ప్రవేశాల కోసం ఈనెల 27, 28 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్ తెలిపారు.ఈ ఎంపికలకు 14 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు.ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది ఒరిజినల్ పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు: జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) , స్టడీ సర్టిఫికెట్,10వ తరగతి మెమో, ఆధార్ కార్డు,10 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ,ఉమ్మడి జిల్లాలకు చెందిన రెజ్లింగ్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్పోర్ట్స్ హాస్టల్‌లో చేరడం ద్వారా మెరుగైన శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని పి. కాశీ హుస్సేన్ తెలిపారు.
Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు