అభినందనలు పక్కనపెట్టి... అభివృద్ధిపై దృష్టి సారించండి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ప్రగతికి పట్టం కట్టండి

షాద్ నగర్ : మున్సిపల్ పాలనలో మార్పు కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు కొత్త పాలకవర్గంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని సన్మానాలు, సత్కారాలు, అభినందన సభలతో కాలం వృథా చేయకుండా నేరుగా అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.గత పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు ఏడాది పాటు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పరిపాలన సాగింది.ఆ సమయంలో తాత్కాలిక చర్యలు తీసుకున్నప్పటికీ,స్థిరమైన అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగలేదని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మౌలిక వసతుల కొరత తీవ్రంగా మారింది.పలు కాలనీల్లో సీసీ రోడ్లు లేక వర్షాకాలంలో బురదలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.అండర్‌డ్రైనేజీ సరిగా లేక మురుగు నీరు రోడ్లపైకి రావడం, దుర్వాసనలు వ్యాపించడం సాధారణమైపోయింది. వీధి దీపాలు పనిచేయక రాత్రివేళల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. తాగునీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు ప్రజల రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికలతో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటికైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం నెలకొంది. నిలిచిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే విడుదల చేసి మున్సిపల్ పరిపాలన సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.
అధికారులు,ప్రజాప్రతినిధుల సమన్వయమే అభివృద్ధికి బాట
ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేస్తేనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పార్టీలు వేర్వేరైనా ప్రజా సంక్షేమం అనే లక్ష్యం ఒక్కటే కావాలని సూచిస్తున్నారు.తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో అధికార యంత్రాంగం అనుభవం, ప్రజాప్రతినిధుల స్థానిక అవగాహన కలిస్తే పనులు వేగంగా పూర్తవుతాయి.సమన్వయం లేకపోతే ప్రాజెక్టులు ఆలస్యమవడం, నిధుల వినియోగం సక్రమంగా జరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా తీసుకుని కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగితేనే పట్టణం ప్రగతి సాధ్యమని స్థానికులు చెబుతున్నారు.పని తనంలో అభివృద్ధి చూపించాలని వారు స్పష్టం చేస్తున్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


