ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
బాధితులకు భరోసా, నేరాల నివారణపై ప్రత్యేక ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా ఉండేలా పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ అన్నారు. గురువారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, భౌగోళిక మ్యాప్‌ను పరిశీలించి క్రైం హాట్‌స్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్రంగా రివ్యూ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల స్థితిగతులపై సవివరంగా సమీక్షించి, విలేజ్ పోలీస్ అధికారి (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించడంతో పాటు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంతో పోలిస్తే నేరాల రేటు తగ్గిందని, కేసుల దర్యాప్తులో వేగం, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు.స్టేషన్ పరిసరాల్లో 5S విధానాన్ని అమలు చేస్తూ పరిశుభ్రతను కాపాడాలని, ఫైళ్లను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా చెక్ పెట్టేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువతలో చట్టంపై గౌరవం పెంపొందించేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు పోలీస్ శాఖకు కేటాయించిన పెట్రోకార్, బొలెరో, ద్విచక్ర వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ మొగిలి, ఎస్‌ఐ గణేష్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


