ప్రజా సమస్యలు గాలికి.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట

తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు అరుణ్‌కుమార్‌, అసెంబ్లీ ఇంచార్జి వేణుగోపాల్ యాదవ్

ప్రజా సమస్యలు గాలికి.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట

ఆదిలాబాద్‌ :  ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, నాయకులు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ తమ ఆస్తులను రెట్టింపు చేసుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు అరుణ్‌కుమార్‌ విమర్శించారు. రోడ్లు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేక ఆదిలాబాద్‌ వెనుకబడిపోతుంటే.. నాయకులు మాత్రం ఆర్థికంగా ఎదుగుతున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని, జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పేరుతో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేకపోతే విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని విలువైన భూములను కొందరు నాయకులు తమ పేర్లపై మార్చుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు విక్రయించారన్న ఆరోపణలపైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. చనాక–కొరట ప్రాజెక్టుపై ప్రభుత్వం స్వతంత్రంగా విచారణ చేపట్టాలని కోరారు. భూసేకరణ పూర్తి చేసి కాలువల నిర్మాణం చేపడితే జిల్లాలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తి ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వేణుగోపాల్‌ యాదవ్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి మడావి బాపూరావు, యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రమోద్‌, మైనార్టీ నాయకుడు జావిద్‌, నాయకులు కార్తీక్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్