కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం.. వృద్ధురాలి మృతి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం.. వృద్ధురాలి మృతి.

  • కామారెడ్డి పట్టణంలోని గంజ్ స్కూల్ సమీపంలోని కొఠారి గల్లీలో దారుణ ఘటన.
  • ఇంటి లో ఉన్న వృద్ధురాలు  మెడలోని బంగారు  గొలుసు ఆభరణాలు లాక్కొని,గొంతు నులిమి హత్య 

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు ఆభరణాల కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు, ఇతర ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. మృతురాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ స్కూల్ సమీపంలోని కొఠారి గల్లీకి చెందిన చిట్టిమెల్ల అనసూయ (70)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కల కలం రేపింది. సుమారు మూడు గంటలపాటు రెక్కీ నిర్వహించిన దుండగులు పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబ డినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ స్కూల్ సమీపంలో ఉన్న కొఠారి గల్లీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. చిట్టిమెల్ల అనసూయ (70) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసుతో పాటు ఇతర ఆభరణాలను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలి మెడలోని బంగారం కోసమే దుండగులు సుమారు మూడు గంటలపాటు ఆ గల్లీలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికతో ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.బంగారు ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. అలాగే పోలీసులు క్లూస్ టీం ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు.  డాగ్ స్క్వాడ్ ను తెప్పించి దుండగుల కోసం గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ మృతి చెందిన వృద్ధురాలు ఇంటి నుంచి రైల్వే స్టేషన్ పరిసరాల వద్ద వెళ్లి ఆగిపోయింది

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ