బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నస్పూర్(మంచిర్యాల): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు కొక్కిరాల సత్యనారాయణ రావు, కొక్కిరాల పాపారావు గార్ల మాతృమూర్తి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ఈరోజు వారి నివాసానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దివంగతుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


