రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
విజన్ ఆంధ్ర ఎఫెక్ట్..
- పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
- ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
మర్పల్లి, : రైతులు నాణ్యత లేని ఎరువులతో నష్టపోతున్నారంటూ విజన్ ఆంధ్రలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ కోట మర్పల్లి గ్రామంలోని రైతుల పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు.కోట మర్పల్లి గ్రామానికి చెందిన రైతులు టీఎస్‌పీ ఎరువులు వినియోగించినప్పటికీ పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదని, ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఏవో శ్రీకాంత్ రైతుల పొలాలను స్వయంగా పరిశీలించి పంటల పరిస్థితిని అంచనా వేశారు. అలాగే రైతులు కొనుగోలు చేసిన టీఎస్‌పీ ఎరువులను కూడా తనిఖీ చేసి, వాటికి సంబంధించిన వివరాలను సేకరించారు.
టీఎస్‌పీతో పాటు డీఏపీ వేయాలి
ఈ సందర్భంగా ఏవో శ్రీకాంత్ మాట్లాడుతూ రైతులు టీఎస్‌పీతో పాటు డీఏపీ కూడా వినియోగించాల్సి ఉంటుందని, కేవలం టీఎస్‌పీ ఎరువును మాత్రమే వేయడం వల్ల పంటలు ఆశించిన స్థాయిలో ఎదగకపోయి ఉండవచ్చని తెలిపారు. పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా పంటల పరిస్థితిని మెరుగుపరిచేందుకు నానో యూరియాను ఉచితంగా అందించాలని సంబంధిత ఫర్టిలైజర్ నిర్వాహకుడిని ఆదేశించినట్లు ఏవో శ్రీకాంత్ తెలిపారు. నానో యూరియాను పిచికారీ చేయడం ద్వారా పంటలు కొంతమేర మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:22:56
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
