వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

వెల్దుర్తి మెదక్ : వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను పక్క గ్రామానికి తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు, యువత మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి వినతిపత్రం అందజేశారు.భూమి వసతులు లేవన్న సాకుతో స్కూల్ ను తరలించడం సరికాదని, మండల కేంద్రమైన వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులకు ఇక్కడే అనుకూలంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ _"పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మంజూరైన పబ్లిక్ స్కూల్ ను తరలించడం వల్ల చాలా మంది చదువుకు దూరమవుతారు. మంత్రి గారు జోక్యం చేసుకొని స్కూల్ ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం"_ అని అన్నారు.మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, యువజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి