అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తాం: ఎమ్మెల్యే కె.ఆర్  నాగరాజు 

అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తాం: ఎమ్మెల్యే కె.ఆర్  నాగరాజు 

హన్మకొండ :అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.శనివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో  కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పేదల ముఖంలో చిరునవ్వులు పూయిస్తోందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థిక పోరాటానిచ్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.తాజాగా శనివారం నుంచే లబ్ధిదారులకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి, నాయకులు,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు. 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి