స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 

స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 

నిజామాబాద్, : శాంతి, అహింస,సాయుధ విప్లవ పోరాట ఉద్యమాలతో ఎందరో మహనీయులు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడడం జరిగిందని విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు, ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సవితారాణి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.. ఈ సందర్బంగా డాక్టర్ సవిత రాణి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం వందల ఏళ్ల పాటు బానిస సంకెళ్ళ విముక్తి కోసం స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదంతో తమ ప్రాణాలను సైతం అర్పించడం వల్ల స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.. అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచి దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం దేశభక్తి గీతాలతో  పలు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన  విశ్రాంత ఉత్తమ ప్రధానోపాధ్యాయులు దాసరి విజయానందరావు మాట్లాడుతూ 150 సంవత్సరాలకు పైగా బానిస సంకెళ్ల మధ్య దేశ ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు.. అలాంటి సమయంలో శాంతి, అహింస, సాయుధ, విప్లవోద్యమాలతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేసి పోరాటాలు చేయడం జరిగిందన్నారు అలాగే అల్లూరి సీతారామరాజు తుపాకీ కి ఎదురెళ్లి మరి పోరాటం చేసి వందేమాతరం అంటూ ప్రాణాలర్పించిన గొప్ప వీరులని కొనియాడారు.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని నేటి బాలలు, యువత , పెద్దలు ప్రతి ఒక్కరు బాధ్యతగా దేశ సమైక్యత, ప్రపంచ నలుమూలల చాటే విధంగా దేశ గొప్పతనాన్ని తెలియజేసే దిశగా కృషి చేయాలన్నారు.. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మానసిక దివ్యాంగ విద్యార్థులకు అంద విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను శాలువలు జ్ఞాపికాలతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ కోశాధికారి తాటి సుధాకర్, జాయింట్ సెక్రెటరీ షేర్ల దయానంద్ , వర్గ సభ్యులు రమణారెడ్డి, లోకల్ కమిటీ చైర్మన్ బాబా గౌడ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిరంజన్ ప్రసాద్ , దాత వేదవతి కులకర్ణి, స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి