పీవీకే-5 ఇంక్లైన్‌లో ఉద్యోగులతో జీఎం వెంకటరమణ పరిచయ సమావేశం..

పీవీకే-5 ఇంక్లైన్‌లో ఉద్యోగులతో జీఎం వెంకటరమణ పరిచయ సమావేశం..

  • భద్రతకు తొలి ప్రాధాన్యం - సురక్షిత ఉత్పత్తే లక్ష్యం..
  • ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన కొత్తగూడెం ఏరియా జీఎం

కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ సి.హెచ్. వెంకటరమణ సోమవారం పీవీకే-5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులతో పరిచయ సమావేశం నిర్వహించారు. మొదటి షిఫ్ట్‌లో గనిని సందర్శిం చిన ఆయన, ముందుగా పీవీకేలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గని అధికారులు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన జీఎం గని నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉత్పత్తి లక్ష్యాలు, ఉద్యోగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదరహిత వాతావరణంలో విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూనే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాల ని పిలుపునిచ్చారు.సింగరేణి సంస్థ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులు ఒక జట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఉద్యోగుల సంక్షేమం, పని పరిస్థితుల మెరుగుదల, సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సూచనలు, సలహాలను స్వీకరిస్తూ అందరితో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం ఎం. గోవిందరావు, పీవీకే ఏజెంట్ రామ్ భరోస్ మెహతో, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, గ్రూప్ ఇంజనీర్ గోదావరి శ్రీనివాస్, మేనేజర్ పి. రవికిరణ్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్. అనిల్ సాగర్, పిట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ భూక్య రమేష్, ఐఎన్‌టీయూసీ పిట్ సెక్రటరీ చిలక రాజయ్యతో పాటు అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం