బాల్కొండ మండలంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నిజామాబాద్ : బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో BRS నాయకులు మోహన్ రెడ్డి తండ్రి కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త కత్తి భోజన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు బాల్కొండ మండల కేంద్రానికి చెందిన BRS కార్యకర్త రంజిత్ యాదవ్ తండ్రి కాలం చేయడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన BRS కార్యకర్త ద్యావతి రవికి హార్ట్ ఆపరేషన్ జరగడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాల్కొండ గ్రామ 8వ బూత్ ఇంచార్జ్ పిప్పేర ప్రవీణ్ కుమార్తెకు క్యాన్సర్ గడ్డకు సర్జరీ జరగడంతో కుటుంబ సభ్యులను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి, చిన్నారికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా చికిత్స ఖర్చుల నిమిత్తమ్ వారికీ 10,000 సహాయం అందజేశారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:22:56
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
