అంగరంగ వైభవంగా గోరింటాకు వేడుకలు
మల్లాపూర్ / జగిత్యాల : మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మహిళా మనుల ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులను అరికడుతుందని శరీరంలో వేడిని తగ్గిస్తుందని అందాన్ని పెంపొందిస్తుందని తలకు పెట్టుకుంటే చుండ్రు నివారణ కూడా ఉపయోగపడుతుందని అన్నారు. కృత్రిమంగా దుకాణాల్లో దొరికే కోన్లను వాడకుండా ప్రకృతి అందించిన సహజసిద్ధమైన గోరింటాకు వాడడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని,గోరింటాకు అమ్మవారి స్వరూపము అని మన సంస్కృతిలో గోరింటాకు వేడుక ఒక ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కావ్య, రమ, హారిక, సరిత, సౌమ్య, లాస్య, పాల్గొన్నారు.
Views: 50
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
