ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి
బీజేపీ అధ్యాత్మిక సెల్ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ : జిల్లాలోని ఆలయాల పరిరక్షణకు పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ అధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఆధ్యాత్మిక సెల్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలో చారిత్రాత్మక ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటి భూముల పరిరక్షణ చేపట్టాలన్నారు. ఆలయాలపై దాడులు వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించి ఆసరాగా నిలవాలని సూచించారు. హిందువులందరినీ కలుపుకొని సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆలయాల భూముల కబ్జాలను ఆక్రమణలను అడ్డుకోవాలని తెలిపారు. అనంతరం నూతన కమిటీలను నియమకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యాత్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సూర్య ప్రకాష్ రావు, కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వీనర్ నవీన్, జిల్లా కన్వీనర్ మేఘా సుబేదార్, రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజు, జిల్లా కో కన్వీనర్ రాజేష్, చంద్ర కాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


