నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు

జెట్ పోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల, జటప్రోలు ఆలయం, రామాపురం ఆసుపత్రి సందర్శన

నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు

జెట్ పోల్ (నాగర్ కర్నూల్):నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.జెట్ పోల్ లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం జటప్రోలు శ్రీ మదన గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్పకళా విశేషాలను పరిశీలించారు.రామాపురం మాతా శిశు వైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, వైద్య పరికరాల వినియోగం, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించి, రికార్డులను పరిశీలించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించకుండా రోగులకు సకాలంలో సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!