తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

సూపర్ ఎల్ నీనో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ, నీటిపారుదల, భూగర్భ జల శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ - నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్లను పూర్తి సామర్థ్యంతో ఉంచాలని, ఎల్లూరు నుంచి కేఎల్ఐ పంపుల ద్వారా తాగునీటి సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉందని రైతులకు హామీలు ఇవ్వవద్దని, ప్రస్తుతం తాగునీటికే నీరు ఉందని తెలియజేయాలన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని, నీరు వృథా కాకుండా చూడాలన్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 57 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులో డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలేనని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నందున నీటిని పొదుపుగా వాడేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!