చౌటకూర్‌లో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

* నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి – ADA రమాదేవి * నేల ఆరోగ్యం, నాణ్యమైన విత్తనాల ఎంపికతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన

చౌటకూర్‌లో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

చౌటకూర్  :-  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన రావెప్  విద్యార్థులు, సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చౌటకూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు, నూతన సాగు విధానాలపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆందోల్ సహాయ వ్యవసాయ సంచాలకులు  రమాదేవి మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటల సాగు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని కోరారు.
రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతినిధి డాక్టర్ ఎం. మాధవి మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం వ్యవసాయంలో ఎంతో ముఖ్యమని వివరించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై కూడా దృష్టి సారించాలని, ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సంగూపేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. నిర్మల యాసంగి సీజన్‌లో సాగు చేసుకోవడానికి అనువైన లాభదాయకమైన కూరగాయల పంటలు, వాటి సాగు విధానాలు, పంటల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు.సంగారెడ్డి కోఆర్డినేటర్ డాక్టర్ కె. అరుణ మాట్లాడుతూ రాబోయే ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సమర్థవంతంగా సాగు చేసుకునే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి పొదుపు పద్ధతులను అనుసరించాలని పిలుపునిచ్చారు.

ఆకట్టుకున్న ఆధునిక వ్యవసాయ నమూనాలు

రైతు సదస్సులో భాగంగా రావెప్ విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, మిశ్రమ పంటల సాగు, సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించిన వర్కింగ్ మోడళ్లను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ నమూనాల ద్వారా రైతులకు నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

వ్యవసాయ రంగంలో రోజురోజుకూ వస్తున్న సాంకేతిక మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని, శాస్త్రీయ పద్ధతులను తమ పొలాల్లో అమలు చేయడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకొని మెరుగైన దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో చౌటకూర్ సర్పంచ్ రాంరెడ్డి, చౌటకూర్ వ్యవసాయ అధికారిణి ప్రవీణ, ఏఈఓ గాయత్రి, ఆందోల్ వ్యవసాయ అధికారి శ్రీహరి, పుల్కల్ వ్యవసాయ అధికారి చైతన్య తదితర అధికారులు పాల్గొన్నారు.

సుల్తాన్‌పూర్, షరీఫ్‌పల్లి, చౌటకూర్, సంగూపేట్, డాకూర్, బ్రాహ్మణపల్లి, సాయిబాన్‌పేట్ తదితర గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వ్యవసాయ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అధికారుల సూచనలు, విద్యార్థుల ప్రదర్శనల ద్వారా వ్యవసాయంలో నూతన పద్ధతులపై అవగాహన పొందారు. రైతుల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది.

Views: 89

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన చౌటకూర్‌లో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన
చౌటకూర్  :-  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన రావెప్  విద్యార్థులు, సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చౌటకూర్...
నా తెలంగాణ కోటి రతనాల వీణ... గంగారం ఉన్నత పాఠశాలలో మార్మోగిన దాశరథి 49వ స్మృతి
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం
ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి
దుదేకుల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు
పి ఆర్ జి టి ఏ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
బాన్సువాడ మండల సమావేశం.