నల్లగొండ మేయర్,డిప్యూటీ మేయర్ ల ఎన్నిక ఏకగ్రీవం. నగర అభివృద్ధికి మంచి సంకేతం.
కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో పనిచేయాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రపి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేట్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నంత కాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు.ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి,అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
.jpeg)
ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల ఫ్రీ కరెంటు బిల్లు చెల్లించిందని,ఒక్కో కుటుంబానికి సుమారు 50 వేల రూపాయల వరకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు.మేయర్‌తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు.మూడేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండి, పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.తనకు పదవులు ముఖ్యమేమీ కావని, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు.ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గెలిచిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మూడేళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని,వెంటనే మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్,ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ,నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, గ్రంథాల సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
డిప్యూటీ మేయర్ అషరత్ అలీ మహమ్మద్.

About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


