ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.
వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రభుత్వమే నిర్వహించాలి......వంగూరు రాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.....

నాగార్జునసాగర్ : భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 ను సవరించి క వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని,సిఎస్ సి హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన నల్లగొండ లోని దొడ్డి కొమరయ్య భవన్ లో నిర్వహించారు.ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నిర్మాణరంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు.భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం,సహజ మరణం,శాశ్విత,పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్,ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.సిఎస్ సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లక్షలాది మంది నిర్మాణ రంగా కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు.అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2వేల 309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే సిఎస్ సి హెల్త్ చెకప్ పేరుతో 500 కోట్లు కాజేశారని అన్నారు.కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించి తీరిక ప్రభుత్వానికి అధికారులకు లేదని అన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణరంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని,గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే కుట్రలు అపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట రవీందర్ జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య,ఎస్ సైదాచారి,పోలే సత్యనారాయణ,బైరం దయానంద్,బి సైదులు,మంద రాజు,కోడి రెక్క మల్లయ్య, ధరావత్ శ్రీదేవి, వడ్డేపల్లి శంకర్, రేవెల్లి యాదయ్య, గుండ్లపల్లి వెంకన్న,ఎస్.కె హుస్సేన్, వెంకట్ రామ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

