కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
కారేపల్లి (ఖమ్మం) : సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వివిధ లైసెన్స్ హక్కులకై వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు,కార్య నిర్వహణ అధికారి కటుకూరి వెంకటయ్య తెలిపారు.మంగళవారం కోట మైసమ్మ ఆలయంలో వారు మాట్లాడుతూ..దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తారీకు నుండి నిర్వహించు 11 రోజుల జాతర ఉత్సవములకు వివిధ రకముల లైసెన్స్ హక్కులు పొందుటకు ఈనెల 24 వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీ కోట మైసమ్మ దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామం దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొబ్బరికాయల పూజా సామాగ్రి,లడ్డు పులిహోర, పుట్నాలు పేలాలు, కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొనుట, మిఠాయి అమ్ముకొనుట, ఐస్ క్రీములు అమ్ముకొనే లైసెన్స్ హక్కులను పొందుటకు నిర్వహించే బహిరంగ వేలంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇతర వివరములకై శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించగలరని తెలిపారు.
Views: 71
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
