రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా

రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా

తాండూరు (వికారాబాద్ జిల్లా) కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. బుధవారం  యాలాల మండలం లక్ష్మి నారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్  పార్టీ  ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నివసిస్తూ నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 67

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం