విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఎంసీపీఐయూ
బెల్లంపల్లి, మంచిర్యాల: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'చలో పార్లమెంట్' కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు గత 20 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి, బలప్రయోగానికి దిగడం బాధాకరమ న్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, దానిని లాఠీలు, బాష్పవాయు గోళాలతో అణచివేయడం సరికాదన్నారు. విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. సమావేశంలో ఎంసీపీఐయూ పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఆరెపల్లి సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
