ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ఆ పాఠశాలలపై చర్యలు,

10వ తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాల సాధన పై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

WhatsApp Image 2026-01-31 at 6.03.58 PM

 

నాగర్ కర్నూల్  : జిల్లాలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన ఉండాలని, ఆ దిశగా నోడల్ అధికారులు, మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిఇఓ రమేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ అంశాలపై మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రెసిడెన్షియల్ కళాశాలల ప్రిన్సిపల్ కేజీబీవీల ప్రత్యేక అధికారులు సంభందిత అధికారులతో సమీక్షించారు.
 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చు 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నందున మెరుగైన ఫలితాలు సాధించేందుకు రానున్న 40 రోజులు అందరం సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.  గణితం, భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఆంగ్ల సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను సన్నద్దం చేయాలని, ప్రతి పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులను పరీక్ష కాలపరిమితిలో సమాధానాలు రాసేలా ప్రతిరోజు కొంత సమయంలో చిన్న చిన్న పరీక్షలు నిర్వహించి సన్నద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం అవసరమైన అన్ని పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు పాఠశాలలో అందుబాటులో ఉండాలని, ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో  10వ తరగతి విద్యార్థులకు అవసరమైన అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని,  వెనుకబడిన పిల్లలకు సబ్జెక్టు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సన్నద్ధత వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్గి ఉండాలని, పదో తరగతి ఉత్తమ ఫలితాలకు కృషిచేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బహుమతులతో పాటు సన్మానాలు  చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని అన్ని రకాల పాఠశాలల్లో చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే ఆ పాఠశాలలో పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పదో తరగతి ఫలితాల పెంపుదలపై నలుగురు నోడల్ అధికారులను కలెక్టర్ నియమించారు. అన్ని పాఠశాలల్లో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను ఆదేశించారు. డొమెస్టిక్ కనెక్షన్లు అందించేలా ఎల్పిజి డీలర్లతో సమావేశం నిర్వహించి ఒకే రకమైన ధరను పాఠశాలలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదనపు కలెక్టర్కు సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మూత్రశాలలు అందుబాటులోకి చచ్చేలా కృషి చేయాలని, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యాభివృద్ధికి మండల స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లాలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేజీబీవీల్లొ, భవిత కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, నోడల్ అధికారి కురుమయ్య, ఏసీజీ రాజశేఖర్ రావు, సెక్టోరల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటయ్య, నూరుద్దీన్ షర్ఫుద్దీన్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం! జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం!
    మల్యాల  : శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి సీఎం కప్  ఆటల పోటీలలో అండర్-18 షాట్
ఝరి బి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్
జన విజ్ఞాన వేదిక వార్షికోత్సవంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
శివరాత్రి సందర్బంగా మర్పల్లిలో పండ్ల కొట్టుల సందడి
జాతర ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ నగేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని అంచనా
అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
కాకతీయుల కళావైభవం... నాగులపహాడ్ శివాలయం