జెండా ఎగరని పల్లె దవాఖాన.. అధికారుల తీరుపై స్థానికుల విమర్శలు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని పల్లె దవాఖాన (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) వద్ద స్వాతంత్ర్య దినోత్స వం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలు, విద్యాసంస్థలు, ప్రజా సేవా కేంద్రాల్లో మువ్వన్నెల జెండాను ఘనంగా ఎగురవేస్తుంటే, మండల కేంద్రంలోని పల్లె దవాఖాన వద్ద మాత్రం జెండా ఆవిష్కరణ జరగకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కల్పించాల్సిన కేంద్రంలోనే నిర్లక్ష్యం:
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దవాఖానలో వైద్యుడు అందుబాటులో ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించలేదు. మండల కేంద్రంలో పల్లె దవాఖాన నడుస్తున్న విషయమే చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్య సేవలపై విస్తృతంగా ప్రచారం, అవగాహన కల్పించాల్సిన చోట.. జాతీయ పర్వదినం రోజున కనీస కార్యక్రమం కూడా చేపట్టకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల వివరణ కోరుతున్న స్థానికులు:
మండల కేంద్రంలో నిర్వహించిన ఇతర అధికారిక కార్యక్రమాలకు సిబ్బంది హాజరైనప్పటికీ, నేరుగా పల్లె దవాఖాన ప్రాంగణంలో జెండా ఎందుకు ఎగురవేయలేదో స్పష్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, పల్లె దవాఖాన వద్ద జాతీయ పర్వదినాలను అధికారికంగా నిర్వహించాలని, అలాగే అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Views: 42
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 17:35:07
నిజామాబాద్ : ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ ,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం... జెండా ఆవిష్కరణ కు
