ఘనంగా బాన్సువాడ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
గ్రామ, పట్టణ స్థాయిలో రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ : భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణం లో ని తన నివాసం వద్ద, ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో, తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో జాతీయ జెండా ను ఎగురవేసి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాల ను స్మరించుకున్నారు. అదేవిధంగా బాన్సువాడ మున్సిపల్ పరిధి లో 80 వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయం, గ్రంథాలయం, మార్కెట్ కమిటీ, వ్యవసాయ కార్యాలయం, సబ్ రిజిస్టర్, ఆర్టిఏ కార్యాలయం, పి ఆర్ కార్యాలయం, ఆర్ అండ్ బి, ఆర్టీసీ కార్యాలయం, బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం లో సీనియర్ జర్నలిస్టు లతీఫ్ జెండా ను ఆవిష్కరించారు బాన్సువాడ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం, కాంగ్రెస్ బి.ఆర్.ఎస్, బిజెపి, సిపిఐ, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించి జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులు శ్రీకాంత్ రెడ్డి, చింతకింది సాయి గౌడ్, మోయిన్, పండరి గౌడ్, సతీష్ గౌడ్, సుధాకర్ గౌడ్, చందు, సివిఆర్ శ్రీను, సాక్షి హైమద్, జాకీర్, సాయి రెడ్డి, కాలి క్, నబి, రమణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 17:30:44
ఆటో డ్రైవర్ల సేవలు అభినందనీయం
మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్
