బర్దిపూర్ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను "అంబేద్కర్ సంఘం" సభ్యులు ముచ్చ పౌలు ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆసది కిషన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, అనంతరం ముచ్చ పౌలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను మరియు బాబా సాహెబ్ వారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని కోరారు. గ్రామ ప్రజలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, వీడిసి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


