#Draft: Add Your Title

#Draft: Add Your Title

నాగర్ కర్నూల్/బిజినపల్లి: విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా బిజినపల్లి *సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల* ప్రిన్సిపాల్  సుమతి కి ఉత్తమ ప్రిన్సిపాల్” అవార్డు దక్కింది.80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పాఠశాల సమగ్ర అభివృద్ధికి శ్రీమతి సుమతి మేడం గారు చేస్తున్న కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. సమర్థవంతమైన నాయకత్వం, అంకితభావం మరియు నిరంతర పర్యవేక్షణతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బిజినపల్లి విద్యా మరియు ఇతర రంగాల్లో మరింత ప్రగతి సాధిస్తోందని అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల శ్రేయోభిలాషులు శ్రీమతి సుమతి మేడం కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
 
 
Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి