జెండా ఎగరని అంగన్‌వాడీ కేంద్రం: తాళం వేసి ఉండటంపై గ్రామస్తులు డిమాండ్
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ నిర్లక్ష్యం వెలుగుచూసింది. మండల కేంద్రంలోని సెంటర్-05 అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసి ఉండటం, జాతీయ జెండాను ఎగురవేయకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ విద్యా, సంక్షేమ సంస్థల్లో త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించడం ఆనవాయితీ. అయితే, పల్లె దవాఖాన సమీపంలో ఉన్న సెంటర్-05 అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండా మూసివేయడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే ఈ కేంద్రంలో కనీసం జెండా వందనం కూడా చేయకపోవడం బాధ్యతారాహిత్యమేనని ప్రజలు మండిపడుతున్నారు. జాతీయ పర్వదినాన కేంద్రానికి తాళం ఎందుకు వేశారు? పతాకావిష్కరణ ఎందుకు నిర్వహించలేదనే అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


