బిచ్కుంద గాంధీ చౌక్‌లో ఘనంగా గాంధీ జయంతి
బిచ్కుంద, : జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా బిచ్కుంద గాంధీ చౌక్‌లోని గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ పాలకవర్గం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సీమ సెట్కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్, మున్సిపల్ కౌన్సిలర్లు దర్పల్ కార్తీక సంతోష్, నౌష నాయక్, కె. శ్యామల గంగాధర్, కో-ఆప్షన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


