మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పేరిట నోటీస్ ఇవ్వడంపై నిరసన కార్యక్రమం
పెద్ద ఎత్తున హాజరైన బిఆర్ఎస్ నాయకులు

వెంకటాపురం: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఫోన్ ట్యాపింగ్ పేరిట సిట్ అధికారులు నోటీసు ఇవ్వడం పై ములుగు జిల్లా, వెంకటాపురం మండల బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రము లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుండి ఎన్టీఆర్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు .ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు బాగం ప్రధాన రహదారి పై కూర్చుని బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కనుక సిట్ నోటీసుల పేరుతో ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లు దండుకుందాం అని దురుద్దేశంతో తో మొన్న కేటీఆర్ నిన్న హరీష్ రావు ఇవాళ తెలంగాణ జాతిపిత తెలంగాణ తెచ్చిన మహోన్నత వ్యక్తి,తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిట్ నోటీస్ ఇవ్వడం పై కాంగ్రెస్ పార్టీ ఎంతగా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం అవుతుంది అని,ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అని,వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఆనంతరం మండల అధ్యక్షుడు గంప రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు 66 అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతకాక కాంగ్రెస్ మంత్రులలో సఖ్యత లేక బొగ్గు కుంభకోణంలో మంత్రులకు మరియు ప్రభుత్వానికి మసి అంటుతుందని గమనించిన ముఖ్యమంత్రి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు అని ,అటు చూస్తే ఉపముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని నాపై రాస్తున్న రాతల వెనుక ఏ గద్దలు ఏ ప్రముఖులు ఉన్నారో నాకు తెలుసని ఆయన మాటలకు అర్థాలు కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమైన నాయకులూకు వర్తిస్తాయో, ప్రముఖ మీడియా సంస్థ ను అడ్డుపెట్టుకొని రాపిస్తున్నారో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు.. మరోవైపు బొగ్గు కుంభకోణం బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై వార్తలు రాకుండా రాష్ట్రంలో సిట్ నోటీసులతో రాజకీయం చేసి రాష్ట్ర మీడియా మొత్తం బిఆర్ఎస్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు అని, మొన్న జరిగినటువంటి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలను ప్రజలు కట్టబెట్టారు అని,ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉంటుంది గనుక తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను బి ఆర్ఎస్ పార్టీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టెం రవికుమార్, వేల్పూరి లక్ష్మీనారాయణ, అధికార ప్రతినిధి డర్ర దామోదర్, యువ నాయకులు చెరుకూరి సతీష్, బట్ట నాగేంద్ర, గడ్డం వివేక్, సీనియర్ నాయకులు శాంతమూర్తి యాదవ్, ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, వి ఆర్ కె పురం సర్పంచ్ శ్రీమతి రమ్య, వీరభద్రారం సర్పంచ్ సోలం ఓంపతి, సూరవేడు సర్పంచ్ ఇర్ప మురళి, మాజీ సర్పంచులు పూనెం శ్రీదేవి, సూరిబాబు, వి ఆర్ కె పురం ఉప సర్పంచ్ రాజేశ్వరి, ఆలుబాక ఉప సర్పంచ్ లాలయ్య, బోదాపురం ఉపసర్పంచ్ ఇర్ప మురళి, వార్డు మెంబర్లు ప్రశాంత్, రమాదేవి, మంగవేణి ,సమ్మక్క, జ్యోతి, భాగ్యమ్మ, మల్లయ్య, నాయకులు తోట ప్రశాంత్, సమ్మయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజు, మల్లికార్జున్, వినోద్, గోపి, సుధాకర్, రామకృష్ణ, జానకమ్మ, కృష్ణవేణి, రమ్య ,తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


