విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న పాలకులు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్.

WhatsApp Image 2026-01-22 at 5.17.00 PM

 

ములుగు :  సమాజానికి అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధనే విద్య  ఆ విద్యనే నేటి పాలకులు భ్రష్టుపట్టుస్తు  సమస్యల సుడిగుండంలో, సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలక వర్గాలున్నాయని, దేశ సమగ్రతపై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా 2వ మహాసభలు  ప్రారంభమై  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుండి డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు విద్యార్థుల  ప్రదర్శన నిర్వహించారు. 
. అనంతరం నారా దిలీప్, అనుముల రాజ్ కుమార్ ల అద్యక్ష తన  జరిగిన ప్రతినిధుల మహాసభలో ఎన్ ఎ స్టాలిన్  మాట్లాడుతూ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా దేశ స్వాతంత్ర్యం మా జన్మహక్కు అని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆవిర్భావించి 90 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, అలాంటి ఎఐఎస్ఎఫ్ పనిచేస్తుందుకు గర్వపడాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న  సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ భ్రష్టు పట్టుస్తున్నారని దుయ్యబట్టారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పాలక వర్గాలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం వారి పాలనలోనే అర్థం అవుతుందని అన్నారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్య కార్పొరేటికరణ, విద్య కేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని, విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని, పాలకులు ప్రపంచ బ్యాంక్ సలహాలపై ఆధారపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం' అనే పద్ధతిలో విద్యావ్యాపారానికి పచ్చ జెండా ఊపయాని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్, జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, నాయకులు నేరాళ్ళ జోసెఫ్, నారా దిలీప్, అనుముల రాజ్ కుమార్, దుర్గం శివకుమార్, కుమ్మరి రంజిత్, కొండగోర్ల సాయి కుమార్, చెన్నూరి రామ్ చరణ్, జాడి మహేష్, సునర్కని రణధీర్, చీల దేవేందర్, బోడ సాయి, కృష్ణ, రమ్య, సౌజన్య, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..! హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..!
    వనపర్తి : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి బస్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో ఏపీ 09 బి జెడ్ 0996 అనే నెంబర్ గల
పేట రోడ్ షోలో నిప్పులు చెరిగిన మంత్రి పొంగులేటి
క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
ఫైబర్ నేరాలపైన అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన కళాబృందం: ఎస్ ఐ మహేందర్
హావగిర్ రావు దేశ్ ముఖ్ మరణం... కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
త్రాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి _ జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్
వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: 28వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి నీరోజీ శ్రావణి కవిరాజ్ కుమార్