పాపన్నపేట మార్కండేయ గణేష్ మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం
మెదక్,: పాపన్నపేట మండల కేంద్రంలోని మార్కండేయ గణేష్ మండపం వద్ద గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా కొనసాగుతున్నాయి.శనివారం రోజు పాపన్నపేట చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొడుపాక విఠల్ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ప్రత్యేక ఆకర్షనీయమైన పూలతో విశేష అలంకరణ చేసిన గణేష్ మండపంలో కొడుపాక విఠల్,కొడుపాక రాజేష్ కుటుంబ సభ్యులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అన్నదాన కార్యక్రమంను గణేష్ మండలి కమిటీ సభ్యులు కొడుపాక శివశంకర్, బీకొండ సంపత్,మదనాల అరవింద్, బీకొండ సాయికిరణ్, అచ్చుకట్ల మహేష్, చామంతుల అరవింద్, వళ్ళందేశి మహేష్, పల్లె ప్రసాద్,వళ్ళందేశి ఉదయ్ కిరణ్,బోనకుర్తి దీపక్,పల్లె సాయికిరణ్, పడిగే శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.కాగా ఈపూజ కార్యక్రమంలో పద్మశాలి కులస్థులు కొడుపాక విఠల్, పల్లె సంగమేశ్వర్, వళ్ళందేశి శ్రీనివాస్,పడిగే కృష్ణ, బద్దాపురం సంగమేశ్వర్, కొడుపాక ఉమామహేశ్వర్, పల్లె లక్ష్మణ్,కల్లేటి యుగేందర్, పల్లె రాజు,తూర్పు రాజు, దాసరి యాదగిరి,అచ్చుకట్ల గురునాథ్,తూర్పు రాము, కొడుపాక దుర్గేష్, కొడుపాక పూర్ణచందర్, రాజారాం చంద్రం,వళ్ళందేశి మునీందర్,చామంతుల నాగరాజు,కొడుపాక రాజేష్, వళ్ళందేశి రాజు పెద్దలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణపయ్య ఆశీర్వచనాలు పొందారు. అనంతరం గణేష్ మండపం వద్ద భక్తి పాటలతో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


