ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి

 హన్మకొండ న్యూస్ : ఆగస్టు 16న సీఎం రేవంత్ రెడ్డి  బహిరంగ సభను విజయవంతం చేయాలి అని పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  అన్నారు. ఈ రోజు దామెర మండల కేంద్రంలోని ఏ ఎన్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...ఆగస్టు 16న పరకాల నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయుటకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి   ఏనుముల రేవంత్ రెడ్డి  బహిరంగసభ విజయవంతం చేయాలి అన్నారు.ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, బిఎల్ఎ  , సర్పంచులు, గ్రామ పార్టీ కొత్త, పాత అధ్యక్షులు, కాంటెస్టెంట్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పాక్స్  చైర్మన్లు, మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.
చౌటకూర్ నుంచి పోసానిపల్లెలో గ్రామంలోని వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న చెట్లను యథేచ్ఛగా చెట్ల నరికివేత
పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా..
ఘనంగా ఆదివాసీ దినోత్సవం 
నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం 
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం