ప్రభుత్వ విప్ విజయరమణా రావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

ప్రభుత్వ విప్ విజయరమణా రావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

పెద్దపల్లి ఓదెల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గా మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు (విజ్జన్న)ను శివపల్లి లోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.... ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రావు కు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రభుత్వ విప్‌ గా,మంత్రి హోదాతో ప్రజా సమస్యల పరిష్కారానికి,ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గుర్తింపు,పెండింగ్ సమస్యల పరిష్కారానికి విజయ రమణారావు రావు మరింత చొరవతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమ శంకర్, మాజీ ఎంపీటీసీ చొప్పరి రాజయ్య,కందుల సదాశివ,సత్యం తదితరులు పాల్గొన్నారు. 
Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు పాఠశాలలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చౌటకూర్ పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు.ఇటీవల విద్యుత్...
పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం
ఎమ్మెల్యే పై సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఖబర్దార్..!
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 
అక్టోబర్ చివరి వరకే సింగూరు తాగునీరు
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ శాఖ సేవా కార్యక్రమం.
చౌటకూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్ష సమావేశం