సరిహద్దు ప్రాంత భద్రతపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నరసింహ

సరిహద్దు ప్రాంత భద్రతపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నరసింహ

చింతలపాలెం, (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం భద్రతా పరంగా అత్యంత కీలకమైనదని తెలిపారు. చింతలపాలెం పరిధిలో సిమెంట్ పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు, పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులు, మైనింగ్ కార్యకలాపాలు ఉండటంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలైన కిష్టాపురం, పీక్లా నాయక్ తండా, తమ్మారం, గుడి మల్కాపురం ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, వాటి దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, పోలీసుల స్పందన తీరును నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవన పనులను డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు ప్రతి వారం పర్యవేక్షిస్తున్నారని, పనులు పూర్తికాగానే స్టేషన్‌ను శాశ్వత భవనంలోకి మార్చనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అక్రమ మార్గాలను గుర్తించి కట్టడి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.
Views: 276

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం