మర్రిగూడలో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

మర్రిగూడలో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

మర్రిగూడ, : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు, 6 డీఏల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సమరశంఖం పూరించింది. తపస్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన "మహా ధర్నా" పోస్టర్‌ను మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. తపస్ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తో పాటు స్థానిక, కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా: తపస్ నాయకులు
ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు మట్టపల్లి శ్రీ రమణ, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీశైలం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వచ్చామని,కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ఈ మహాధర్నాకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు.ఉపాధ్యాయ సంఘాలు కేవలం వినతి పత్రాలకే పరిమితమయ్యాయనే అపవాదును చెరిపేస్తూ, హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమయ్యామని పేర్కొన్నారు.ప్రభుత్వం దిగివచ్చి ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చేలా చేయడమే ఈ ధర్నా ముఖ్య ఉద్దేశమని, కాబట్టి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం