గ్రామాల్లో వెంటనే దోమల మందు పిచికారీ చేయాలి
ములుగు/మంగపేట : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగపేట మండలంలోని గ్రామాల్లో ఇప్పటికీ దోమల మందు పిచికారీ చేపట్టకపోవడం ప్రజల అనారోగ్య బారిన పడతారని అన్నారు "ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సంబంధిత అధికారులపై ఉంది. వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేపట్టడంతో పాటు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వెంటనే చర్యలు తీసుకోవాలి" అని గుడివాడ శ్రీహరి డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నిల్వ ఉండే నీరు, మురుగు కాలువల వల్ల దోమలు విపరీతంగా పెరుగుతు న్నాయని, పంచాయతీలు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన సూచించారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
