అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు

నస్పూర్ : శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ 77వ గణతంత్ర వేడుకలను సోమవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో, శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి ఉన్నత పాఠశాల, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ... బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తుందని, అలాగే రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడంలో సింగరేణి ముందు ఉంటుందని తెలియజేశారు. 2025 సంవత్సరానికి ఉత్తమ ఉద్యోగులు, అధికారులుగా గుర్తించిన వారిని, విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన ఉద్యోగులకు, సింగరేణి పాఠశాల, సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్దిని విద్యార్థులకు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ లో గెలుపొందిన వారికి, సాoస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి, కోల్ ఇండియా స్థాయిలో స్పోర్ట్స్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుపొందిన విజయ్ (కోలిండియా బాడీ బిల్డింగ్) కి, కే. కార్తీక్ (కోలిండియా కబడ్డీ) కి, సిహెచ్. సురేందర్ రెడ్డి (కోలిండియా కబడ్డీ) కి జనరల్ మేనేజర్ బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం ఎన్. సత్యనారాయణ, సేవా అధ్యక్షురాలు ఉమరాణి, ఏఐటియుసి బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర రెడ్డి, ఏరియా ఇంజనీర్ టి. రమణ రావు, ఏజీఎం ఫైనాన్స్ పి. సుమలత, ఎస్ఆర్పి ఓసిపి ప్రాజెక్టు ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వేర్లు, ఆర్కే 7 గ్రూప్ ఏజెంట్ కుర్మా రాజేందర్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవి రెడ్డి, ఆర్కె 5 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, ఎస్ఆర్పి 1 & 3 గ్రూప్ ఏజెంట్ జి. రవికుమార్, డీజీఎం పర్సనల్ ఎస్. అనిల్ కుమార్, డీజీఎం సివిల్ ఆనంద్ కుమార్, డీజీఎం ఏరియా వర్క్ షాప్ రవీందర్, డీజీఎం ఫారెస్ట్ ఏబీ హరి నారాయణ, డీజీఎం ఇంటర్నల్ ఆడిట్ దామోదర్, సి హెచ్ పి ఇంచార్జ్ చంద్ర లింగo, ఎన్విరాన్మెంటల్ అధికారి హనుమాన్ గౌడ్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు, సంక్షేమ అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


