యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- ఆటో డ్రైవర్ల సేవలు అభినందనీయం
- మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్
గజ్వేల్/సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు చింతకింది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయక త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకలకు గజ్వేల్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ గుండెల్లో ఉంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆటో కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న వారి శ్రమ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రం చారి, ఆర్అండ్ఆర్ ఆటో యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
